Telangana Holiday: గణేష్ నిమజ్జనం సందర్బంగా గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సెలవును(Telangana holiday) ప్రకటించింది.
- V Santhosh Kumar
- Updated on- September 24, 2026 / 11:34 AM IST
Telangana government declared holiday for schools and offices for Ganesh immersion
Telangana holiday: తెలంగాణ రాజధాని నగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శోభాయాత్రలు, నిమజ్జన వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ప్రజలకు, విద్యార్థులకు సదుపాయంగా ఉండేందుకు ఈ నెల 25 శుక్రవారం రోజున సాధారణ సెలవును(Holiday) ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బుధవారం అధికారిక జీవో ద్వారా స్పష్టం చేశారు.
Read Also – Cooking Oil Prices: పండుగల వేళ కేంద్రం తీపి కబురు.. భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
నవంబరు 14న పరిహార పనిదినంగా ప్రకటన:
ఈ సెలవు వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు, విద్యాసంస్థల పనిదినాలకు భంగం కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికను వెల్లడించింది. వర్కింగ్ డే సర్దుబాటులో భాగంగా ప్రస్తుత సెలవుకు బదులుగా రాబోయే నవంబర్ 14న వచ్చే రెండో శనివారాన్ని పూర్తిస్థాయి పనిదినంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని విభాగాలు మరియు విద్యాసంస్థల అధికారులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
