Lift Safety Act: తెలంగాణలో ‘లిఫ్ట్ చట్టం’.. ముసాయిదా బిల్లు సిద్ధం.. త్వరలోనే అసెంబ్లీకి

రాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్న లిఫ్ట్ (Lift Safety Act)ప్రమాదాలకు కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana government drafts new lift and escalator safety bill

  • తెలంగాణలో కొత్త లిఫ్ట్ చట్టం
  • త్వరలోనే అసెంబ్లీ ముందుకు బిల్లు
  • ప్రతి ఏటా తనిఖీలు తప్పనిసరి

Lift Safety Act: రాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్న లిఫ్ట్ ప్రమాదాలకు కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్‌లో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ‘తెలంగాణ లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, మూవింగ్ వాక్స్ ముసాయిదా బిల్లు’కు ముసాయిదా రూపకల్పన పూర్తి చేసింది.

Thalliki Vandanam: నేడే ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదల.. అర్హుల ఖాతాల్లో 15 వేలు

ఈ ముసాయిదా బిల్లుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన పూర్తయిన తర్వాత క్యాబినెట్ ముందుకు, ఆపై త్వరలోనే శాసనసభ (అసెంబ్లీ) ముందుకు రానుంది. లిఫ్టుల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలైన నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ చట్టం గురించిన వివరాలను స్పష్టం చేసింది.

ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే లిఫ్టు(Lift Safety Act) తయారీ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుంది. అంతేకాకుండా ప్రతి లిఫ్ట్, ఎస్కలేటర్ నాణ్యతా ప్రమాణాలు (బీఎస్ఐ) కలిగి ఉండాలి. ప్రభుత్వ ఇన్‌స్పెక్టర్ల ద్వారా ఏటా తనిఖీలు నిర్వహిస్తారు. తయారీలో నాణ్యత లేకపోతే వినియోగదారుల ఫోరమ్‌లో కేసు వేసే అవకాశం లభిస్తుంది. ఈ చట్టాన్ని తెలంగాణ ఎలివేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అవినాష్ చల్లా స్వాగతిస్తూనే, లిఫ్టులపై ఉన్న 18% జీఎస్‌టీని తగ్గించాలని కోరారు.