Hanumantha Rao : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి.. మాజీ డీజీపీకి కూడా..
Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావుకు కీలక పదవి దక్కింది. బీసీ సంక్షేమం, అభివృద్ధి విభాగాలకు ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- Harish Thanniru
- Updated on- April 30, 2026 / 01:29 PM IST
Hanmantha Rao
Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావుకు కీలక పదవి దక్కింది. ఆయన్ను బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. హన్మంతరావుతోపాటు రాష్ట్ర డీజీపీగా సేవలు పూర్తి చేసుకొని పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి బత్తుల శివధర్ రెడ్డికి కూడా కీలక పదవి దక్కింది. ఆయన్ను రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పదవీ విరమణ రోజునే శివధర్ రెడ్డికి మరో కీలక బాధ్యతలను రేవంత్ సర్కార్ అప్పగించడం గమనార్హం. మూడు సంవత్సరాల పాటు రాష్ట్ర భద్రతా సలహాదారుగా ఆయన సేవలు అందించనున్నారు. శివధర్ రెడ్డి కొత్త బాధ్యతల్లో పోలీస్ వ్యవహారాలు, శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
