Telangana Govt : తెలంగాణలోని విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు సౌకర్యం.. కానీ, వారికి మాత్రమే వర్తింపు..!

Telangana Govt : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని సమాచారం.

Free bus facility for students studying in government schools

  • తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం
  • విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే

Telangana Govt : తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధచేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కేవలం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించేలా నిబంధనలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్నట్లు.. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read : LPG cylinder Price hiked : సామాన్యులకు బిగ్‌షాక్.. మరోసారి పెరిగిన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతోపాటు.. మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయనుంది. కళాశాల స్థాయికి మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు దోహదపడటంతోపాటు.. ప్రతీయేటా పెరుగుతున్న డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. కాంగ్రెస్ హామీల్లో కీలకమైంది మహాలక్ష్మీ ఉచిత బస్సు పథకం. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిచాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వం ఆమేరకు నిర్ణయం తీసుకుంటే.. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.