CM Revanth Reddy
Indiramma Indlu : తెలంగాణలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తోంది. ఇప్పటికే లక్షలాది ఇండ్లు మంజూరు చేసిన రేవంత్ సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : Gold Rate Today : బంగారం కొనేవారికి భారీ గుడ్‌న్యూస్.. అమెరికా దెబ్బతో ధర ఢమాల్.. తులం రేటు ఎంతంటే?
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తున్నట్లు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు వచ్చే నెల చివరినాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సొంత ఇండ్ల స్థలాలు ఉన్న 28వేల మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ టవర్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై హౌసింగ్ అధికారులతో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ భేటీ అయ్యారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్థానిక పరిస్థితులను బట్టి 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ టవర్లను నిర్మించాలనే ఆలోచన చేస్తున్నామని, వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ పరిధిలో మధ్య తరగతి ప్రజలక కోసం గతంలో కేబీహెచ్‌బీలో నిర్మించిన మాదిరిగానే ఇండ్లను నిర్మిస్తామని, ఇందుకు నాలుగు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
అసంపూర్తిగా ఉన్న, ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రులు ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న ఇండ్లకు లబ్దిదారులను గుర్తించి.. ఆ లబ్దిదారులే ఆ ఇండ్లను పూర్తి చేసుకోవడానికి అంతకుముందు ఖర్చుచేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిగిలిన నిధులను హౌసింగ్ కార్పొరేషన్ మంజూరు చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
చాలాచోట్ల ఇండ్లు తీసుకొని అక్కడ నివాసం లేని వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని.. అలాగే, బోగస్ లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. అనర్హుల స్థానంలో రాజకీయాలకు అతీతంగా సమీపంలో ఉన్న అర్హులైన పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించారు. 2బీహెచ్‌కే నివాస ప్రాంతాలలోని ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.