Indiramma Indlu Application: ‘ఇందిరమ్మ ఇళ్ల’ దరఖాస్తు విధానం.. స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ (Indiramma Indlu CURE) ప్రధానమైనది.

Telangana government Indiramma Indlu Application process and full details

  • ఇందిరమ్మ ఇళ్లు సియుఆర్ పద్ధతి
  • ఐదు లక్షల సాయం విడుదల
  • సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం

Indiramma Indlu CURE: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ (Indiramma Indlu Application Process) ప్రధానమైనది. సొంత స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఇటీవల ఈ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో నాణ్యత, పారదర్శకత కోసం అధికారులు CURE (Comprehensive Urban and Rural Engineering) పద్ధతిని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో ఏకంగా 5 లక్షల రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఖరీదైన ల్యాండ్ కాస్ట్‌ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం వివరాలు, అప్లికేషన్ ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.

Also Read: టోల్‌ ప్లాజాల వద్ద సరికొత్త రూల్.. ఇకపై యాప్ ద్వారానే లోకల్ పాస్.. నెలంతా ఉచిత ప్రయాణం?

CURE పద్ధతి అంటే ఏమిటి?

CURE విధానం ద్వారా ఇళ్ల నిర్మాణ సాంకేతికతను, నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తారు. లబ్ధిదారులు కట్టుకునే ఇల్లు బలంగా, ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయి.

ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం సులువైన పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది:

* అప్లికేషన్ ఫారమ్ పొందడం: ప్రజా పాలన దరఖాస్తు ఫారమ్‌ ద్వారా లేదా ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక క్యాంపులలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Indlu Application Process) దరఖాస్తు ఫారమ్ పొంది పూర్తి చేయాలి.

* అవసరమైన పత్రాలు జత చేయడం: దరఖాస్తుకు ఈ క్రింది సర్టిఫికెట్లను జత చేయాలి:

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు / తెల్ల రేషన్ కార్డు
  • ఆదాయ ప్రమాణ పత్రం
  • సొంత స్థలం ఉంటే దానికి సంబంధించిన పత్రాలు
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో & యాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ పాస్‌బుక్

* దరఖాస్తు సమర్పణ: నింపిన దరఖాస్తును సంబంధిత అధికారులకు సమర్పించి, తప్పనిసరిగా రశీదు (Acknowledgment Receipt) తీసుకోవాలి.

* ఫీల్డ్ వెరిఫికేషన్: సమర్పించిన అప్లికేషన్‌ను పరిశీలించడానికి ప్రత్యేక అధికారులు మీ ఇంటికి లేదా స్థలానికి వస్తారు. లబ్ధిదారుడి స్థలం, అర్హతలను పరిశీలించి, మొబైల్ యాప్ ద్వారా జియో-ట్యాగింగ్ చేస్తారు.

* లబ్ధిదారుల ఎంపిక & మంజూరు పత్రం: వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హులైన వారి తుది జాబితాను గ్రామసభలలో ప్రదర్శిస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందిస్తారు.

నిధుల విడుద‌ల ఎలా జరుగుతుంది?

ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ దశల్లో అనగా పునాది, గోడలు, స్లాబ్, కలరింగ్/ఫినిషింగ్ వంటి దశల్లో నిధులను CURE సాంకేతిక పర్యవేక్షణ ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో విడతల వారీగా జమ చేస్తారు. ఇలా ఇందిరమ్మ ఇళ్ళకి సంబందించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీ అర్హతలు, దరఖాస్తు స్థితి తెలుసుకోవడానికి అధికారిక ప్రజా పాలన పోర్టల్‌ను సంప్రదించవచ్చు.

వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు:

స్టెప్ 1: మీ మొబైల్ ఫోన్‌లో అధికారిక మీసేవ వాట్సాప్ నంబర్: 8096958096 ను సేవ్ చేసుకోండి.

స్టెప్ 2: వాట్సాప్‌ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు “Hi” అని సందేశం పంపండి.

స్టెప్ 3: చాట్‌ బాట్ ఇచ్చే ఆప్షన్ల నుండి భాషను ఎంచుకొని, “ఇందిరమ్మ ఇండ్లు” (Indiramma Indlu) విభాగాన్ని ఎంచుకోండి.

స్టెప్ 4: స్క్రీన్‌పై వచ్చే సూచనల ప్రకారం మీ వివరాలు నమోదు చేయండి: దరఖాస్తుదారుడి ఆధార్ సంఖ్య నమోదు చేయడం,వ్యక్తిగత, చిరునామా వివరాలను సరి చూసుకోవాలి.

స్టెప్ 5: సూచించిన విధంగా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి.

స్టెప్ 6: ప్రక్రియ పూర్తయ్యాక మీకు మీ Application Number / Reference ID మెసేజ్ రూపంలో వస్తుంది. దానిని జాగ్రత్తగా దాచుకోండి.