Liquor prices increased : మద్యం ప్రియులకు బిగ్ షాక్.. ఈ బ్రాండ్ల రేట్లు భారీగా పెరుగుతున్నాయ్.. ఇక ముట్టుకోలేరు..
Liquor prices increased : మద్యం ధరల సవరణకోసం ప్రభుత్వం గతంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చేవారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత ప్రభుత్వం మద్యం ధరల పెంపుపై అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది.
- Harish Thanniru
- Updated on- May 3, 2026 / 08:25 AM IST
Liquor prices increased
- మద్యం ప్రియులకు బిగ్ షాక్..
- ఈ బ్రాండ్ల ధరలు పెరుగుతున్నాయ్..
- వారం పదిరోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్
Liquor prices increased : మద్యం ప్రియులకు బిగ్ షాకిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే వారం రోజుల్లో పలు రకాల బ్రాండ్ల మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి మద్యం ధరలు పెంచే ఆనవాయితీ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2023 మే నెలలో మద్యం ధరలు పెరిగాయి. నిబంధనల ప్రకారం.. 2025 మే నెలలో మద్యం ధరలు పెరగాల్సి ఉంది. కానీ, వివిధ కారణాల వల్ల ప్రభుత్వం మధ్యం ధరలను పెంచలేకపోయింది. మద్యం తయారీ కంపెనీలు ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మద్యం ధరల సవరణ కోసం ప్రభుత్వం గతంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వచ్చేవారం సమావేశం కానుంది. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. భారీగా ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సాధారణ బ్రాండ్స్ కు చెందిన ఫుల్ బాటిపై రూ.60 వరకు, ప్రీమియం బ్రాండ్స్ ఫుల్ బాటిల్ పై రూ.100 వరకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ధరలు పెరిగితే ప్రతి నెలా రూ.250కోట్లు, ఏడాదికి సుమారు రూ.3వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ప్రస్తుతం వేసవి కాలం.. మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మద్యం ధరలు భారీగా పెంచితే సామాన్య, మధ్య తరగతి వర్గాల మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ధరలు భారీగా పెంచకుండా నామమాత్రంగా పెంచాలని ఆలోచన చేస్తుందన్న వాదన కూడా ఉంది. ఏదిఏమైన మరో వారం పదిరోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే మద్యం ప్రియులకు బిగ్ షాకేనని చెప్పొచ్చు.
