Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్‌షాక్..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు బిగ్ షాకిచ్చింది.
- Harishth Thanniru
- Updated on- April 21, 2026 / 10:20 PM IST
Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు.. ఆ ఇండ్లలో నివసించకుంటే లబ్ధిదారులకు ఇల్లు రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇండ్లు పొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాలని స్పష్టం చేసింది. టూ బిహెచ్‌కే ఇండ్లు తీసుకుని వాటిల్లో నివసించని వారికి కేటాయించిన ఇండ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రద్దు చేసిన ఇళ్లను కొత్తవారికి కేటాయించిన ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తి అయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. టూ బీహెచ్‌కే ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే వారికి ఇచ్చిన ఇండ్లకు నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని సూచించారు. రద్దు చేసిన ఇళ్లు కొత్త లబ్ధిదారుల ఇవ్వాలని, సంబంధిత ఆర్డీవోలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు.
