Hyderabad Private Hostels : హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులకు బిగ్ షాక్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Hyderabad Private Hostels : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
- Harish Thanniru
- Published on- October 5, 2026 / 12:02 PM IST
Hyderabad Private Hostels
Hyderabad Private Hostels : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఐటీ కారిడార్‌లో ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరుగైన వసతి సౌకర్యం కల్పించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు రెడీ చేస్తోంది. అంతేకాదు.. ఐటీ కారిడార్‌లో హాస్టళ్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, భూములు లభ్యత, నిర్మాణ సాధ్యాసాధ్యాలు, నిర్వహణ విధానం తదితరల అంశాలపై అధికారులు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారట.
Also Read : Hyderabad Water Supply : హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36గంటలు తాగునీటి సరఫరాకు బంద్..
నగరంలోని ఐటీ కారిడార్‌లో ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల నుంచి ఉద్యోగులు వస్తున్నారు. వీరిలో చాలా మంది ప్రైవేట్ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానక్ రామ్‌గూడ, రాయదుర్గం, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి తదితర ప్రాంతాల్లో హాస్టళ్లకు డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు నిబంధనలకు విరుద్ధంగా భవనాలను నిర్మాణం చేస్తూ అందులో ప్రైవేట్ హాస్టళ్లను నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు.. నాణ్యతలేని భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తూ.. సరైన రీతిలో వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇష్టారీతీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రమాదాలుసైతం చోటు చేసుకుంటున్నాయి.
కొందరు నిబంధనలకు విరుద్ధంగా.. 50, 60 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తులు నిర్మాణం చేస్తూ వాటిని ప్రైవేట్ హాస్టళ్లుగా మార్చుతున్నారు. దీంతో ఇరుకైన గదులతోపాటు భవన నిర్మాణాల్లో నాణ్యత లేకపోవటంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచిఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ప్రైవేట్ హాస్టళ్లపై నియంత్రణతోపాటు ఉద్యోగులకు సురక్షితమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వపరంగా హాస్టళ్లను నిర్మించి నిర్వహించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఐటీ కారిడార్ లో హాస్టళ్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, భూముల లభ్యత, నిర్మాణ సాధ్యాసాధ్యాలు, నిర్వహన విధానం తదితర అంశాలపై అధికారులు క్షేత్ర స్థాయిలో అధికారులు అధ్యయనం చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలతో నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించనున్నట్లు తెలిసింది. సీఎం సూచనలను పరిగణలోకి తీసుకొని ఆ తరువాత ప్రభుత్వ ఆధ్వర్యంలో హాస్టళ్లను నిర్మించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
