Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రైతు ఖాతాల్లోకి నిధులు.. ఎప్పటి నుంచో క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల
Telangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంకు సంబంధించిన సబ్సిడీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
- Harishth Thanniru
- Published On : March 8, 2026 / 09:07 AM IST
Telangana Govt
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- రైతు ఖాతాల్లోకే నేరుగా సాగు యంత్రాల సబ్సిడీ
- అధికారులకు సూచించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Telangana Govt : తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆర్థికాభివృద్ధికోసం అనేక చర్యలు చేపడుతోంది. రైతుల పంట సాగులో ఆర్థిక సహాయంతోపాటు వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద సబ్సిడీపై రైతులకు కావాల్సిన వ్యవసాయ యంత్రాలను అందజేస్తోంది. అయితే, వ్యవసాయ యాంత్రీకరణలో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : Karimnagar District: ఎవరైతే మాకేంటి? మంత్రులను కూడా డోంట్ కేర్ అంటున్న ఆఫీసర్లు.. కరీంనగర్ జిల్లాలో ఎందుకిలా
వానాకాలం సీజన్ -2026 ముందస్తు ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం యంత్రాల కొనుగోలుపై ఇచ్చే 40శాతం సబ్సిడీని కంపెనీలకు అందజేస్తున్నారు.. అయితే, ఆ విధానానికి ఇకపై స్వస్తి చెప్పాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. ఇకనుంచి వ్యవసాయ పనిముట్లపై ఇచ్చే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించేలా చర్యలు చేపట్టనున్నారు. తొలుత కొండారెడ్డిపల్లి, జనంపేటలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి.. ఆ తరువాత మొదటి దశలో 1600 రైతు వేదికలకు విస్తరించాలని రెడ్కో సంస్థకు మంత్రి తుమ్మల సూచించారు.
వచ్చే వానాకాలం సీజన్ కు సంబంధించి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాల దగ్గర నుంచి ఎరువుల వరకు అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు. వానాకాలం సీజన్ కు అవసరమైన ఎరువులు, పచ్చిరొట్ట విత్తనాలను ఏప్రిల్ నెులాఖరు నాటికి సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.
