Telangana Govt : రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్.. వాళ్లకోసం భారీగా నిధులు.. నేరుగా అకౌంట్లలోకి..

Telangana govt : రాష్ట్రంలో పండించిన పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలను ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Telangana govt

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • మొక్కజొన్న కొనుగోళ్లకు రూ.1800 కోట్లు కేటాయింపు
  • రూ.1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు సిద్ధం
  • పొద్దుతిరుగుడు పంటను 25శాతానికి మించి కొనుగోలు చేయాలని నిర్ణయం

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోళ్లు చేస్తున్న విషయం తెలిసిందే. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించింది. తాజాగా మరో రూ.1800 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

Also Read : Gold silver Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. పడిపోతున్న గోల్డ్ రేటు.. ఇవాళ ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే, కొనుగోళ్లు మొదలై దాదాపు నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలుకు 4వేల కోట్లు కేటాయించినా నిధులు జమకాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను కేటాయించింది. ఈ క్రమంలో త్వరలో మొక్కజొన్నల రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో పండించిన పంటల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలను ఆదుకునేందుకు మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా మొక్కజొన్న కొనుగోళ్లకు మరిన్ని నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. అంతేకాక.. రూ. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వం లక్ష్యమని, అందులో భాగంగానే.. పొద్దుతిరుగుడు పంటను 25శాతానికి మించి కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని అధికారులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.