Rythu Bharosa : రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై కీలక నిర్ణయం.. వారందరికీ సాయం..
Rythu Bharosa : యాసంగి పంట సాగుకు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంటలు సాగు చేయని రైతులకు నిధుల విడుదలపై అధికారులకు కీలక ఆదేశాలు అందినట్లు సమాచారం.
- Harish Thanniru
- Published on- November 7, 2026 / 08:32 AM IST
Rythu Bharosa funds
Rythu Bharosa : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్నివిధాల ఆదుకొనేందుకు సిద్ధమవుతోంది. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు సాగుచేసిన పంటలకు నీరులేక ఎండిపోతున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను సైతం ప్రకటించింది. యాసంగిలో వరిసాగు చేయొద్దని.. ఆరు తడి పంటలు సాగు చేయాలని రైతులకు స్పష్టం చేసింది. దీంతో పంటలు సాగుకాక పొలాలు ఖాళీగా ఉన్నాయి. అయితే, యాసంగి పెట్టుబడి సాయం కింద ప్రతీయేటా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. యాసంగిలో పంటలు సాగు చేయని రైతులకు ఆ నిధులు బ్యాంక్ ఖాతాల్లో జమకావనే ప్రచారం జరుగుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధులపై కీలక ప్రకటన చేసింది.
Also Read : Indiramma Housing Scheme : ఇల్లు లేని వారికి తీపి కబురు.. ఇందిరమ్మ టవర్స్‌పై సర్కార్ కీలక నిర్ణయం!
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద ప్రతీ ఎకరానికి రూ.6వేల చొప్పున రెండు విడతల్లో ఎకరానికి రూ.12వేలను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అయితే, ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పంటలు సాగు చేయని రైతులకు రైతు భరోసా నిధులు జమ కావని ప్రచారం జరుగుతుంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని రైతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాగునీరు లేక రైతులు పంటలు సాగు చేయలేకపోతున్నారు. దీంతో పొలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం భారీగా తగ్గే అవకాశం ఉందని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో కూడా పంటలు సాగయ్యే అవకాశం లేదని అంచనా వేశారు. అయితే, ప్రభుత్వం ఇప్పటివరకు సాగయ్యే భూములకే రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటలు సాగు చేయని అన్నదాతలు రైతుభరోసా నిధులు రావని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈసారి సాగు తగ్గినా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అర్హులైన ప్రతి రైతు బ్యాంక్ ఖాతాల్లో పంట సాగుచేసినా, చేయకపోయినా రైతు భరోసా నిధులు జమ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ముమ్మరం చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రైతుభరోసా పథకం కింద గత వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.48 కోట్ల ఎకరాలకు, 70.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.8,759 కోట్ల నిధులను జమ చేసింది. ఈసారి కూడా అర్హులైన ప్రతీరైతు ఖాతాలో పంటలసాగుతో సంబంధం లేకుండా నిధులు జమ చేసేలా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ఉత్తర్వులు రాలేదు. త్వరలో ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చర్చ జరుగుతుంది.
