TG Education Kits : విద్యార్థులకు సర్కార్ శుభవార్త.. 9.5 లక్షల మందికి ఫ్రీగా ఆ 24 వస్తువులు
TG Education Kits : తెలంగాణ విద్యార్థులకి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. 9.5 లక్షల మందకిి 24 వస్తువులు ఉన్న కిట్ ఉచితంగా ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 07:11 AM IST
Telangana government provide education kits for 9 5 lakh students
- విద్యార్థులకి రేవంత్ సర్కార్ శుభవార్త
- 9.5 లక్షల మంది విద్యార్థులకు కిట్లు
- 8-డిగ్రీ విద్యార్థినిల యూనిఫామ్ మార్పు
TG Education Kits : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, సొసైటీలు, స్థానిక సంస్థల పాఠశాలలు మరియు హాస్టళ్లలో ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వారికి 24 రకాల వస్తువులను పూర్తి ఉచితంగా అందించనుంది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ప్రభుత్వ వాటర్ మార్క్ లోగోతో కూడిన ‘ఎడ్యుకేషన్ కిట్‌లు’ అందనున్నాయి. గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్‌కు కూడా ఈ కిట్‌లోని ప్రతి వస్తువు అందించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అందించాల్సిన వస్తువుల వివరాలను టెండర్ ప్రకటనలో పేర్కొంది.
ఈ క్రమంలో ఎల్-1 (L-1) గా ఎంపికైన కాంట్రాక్టర్‌కు ఈఎండీ (EMD) డబ్బును సర్దుబాటు చేయడంతో పాటు, మిగతా మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ సదరు కాంట్రాక్టర్ సరఫరాలో విఫలమైతే, ఆ మొత్తాన్ని జప్తు చేస్తామని ప్రకటనలో వెల్లడించింది. ఎంపికైన కాంట్రాక్టర్ తెలంగాణలోని 33 జిల్లాలకు వస్తువులను సరఫరా చేసే బాధ్యత తీసుకోవాలి. అలాగే కిట్‌లోని వస్తువులు పక్కదారి పట్టకుండా వాటిని ట్రాక్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటితో పాటు 8వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థినుల యూనిఫామ్‌లో మార్పులు చేయాలని సర్కార్ భావిస్తోంది.
AP Results 2026 : ఏపీలోని ఇంటర్, 10th విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాలు వెల్లడి తేదీలు ఇవే..
అందరికీ ఐడీ కార్డులు, స్టేషనరీ కిట్లు:
ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు (KGBVs), హాస్టళ్లు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఐడీ కార్డులు జారీ చేస్తారు. చిన్నపిల్లల నుండి డిగ్రీ విద్యార్థుల వరకు స్టేషనరీ కిట్లు ఇవ్వనున్నారు. ఇందులో బ్లూ, రెడ్ పెన్నులు, ప్లాస్టిక్ స్కేలు, పౌచ్, స్కెచ్ పెన్నులు, పెన్సిల్ బాక్సు, షార్పనర్లు, ఎగ్జామ్ ప్యాడ్ వంటివి ఉంటాయి. చిన్నపిల్లల కోసం క్రేయాన్స్ ఉంటాయి. అలాగే తరగతుల వారీగా విద్యార్థుల కోసం వివిధ పరిమాణాల్లో స్కూల్ బ్యాగులు సిద్ధం చేస్తున్నారు.
- 1 – 3 తరగతి వరకు: 25 లీటర్ల సామర్థ్యం
- 4 – 8 తరగతి వరకు: 30 లీటర్ల సామర్థ్యం
- 9 నుండి డిగ్రీ వరకు: 35 లీటర్ల సామర్థ్యం గల బ్యాగులు అందించాలని నిర్ణయించింది.
వీటితో పాటు విద్యార్థులకు ప్లేట్, హ్యాండిల్ కప్, గ్లాస్, స్పూన్, కటోరాలను (గిన్నెలు) కలిపి ఒక సెట్‌గా సరఫరా చేయాలని ప్రభుత్వం సూచించింది. అలాగే విద్యార్థులకిచ్చే బ్లాంకెట్ (దుప్పటి) అంచులపై ప్రభుత్వ లోగో ఉండాలని, విద్యాసంస్థ లేదా సొసైటీని వేగంగా గుర్తించేలా ప్రత్యేక కలర్ స్కీమ్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
