Telangana: తెలంగాణకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా స్వీకరణ
పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను తెలంగాణ (Telangana)ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక "ది ఇంక్లూసివ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్" జాతీయ అవార్డు దక్కింది.
- V Santhosh Kumar
- Updated on- June 15, 2026 / 09:35 PM IST
Telangana government received Inclusive Enterprise and Ecosystem Development national award.
- తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు.
- కేంద్రమంత్రి చేతులమీదుగా అవార్డు ప్రధానం.
- రాష్ట్రంలో అపారమైన పవన విద్యుత్ అవకాశాలు.
Telangana: పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక “ది ఇంక్లూసివ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఎకోసిస్టమ్ డెవలప్‌మెంట్” జాతీయ అవార్డు దక్కింది. గోవాలోని ఐటీసీ గ్రాండ్‌లో కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన గ్లోబల్ విండ్ డే-2026 జాతీయ సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతుల మీదుగా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, టీజీరెడ్కో ఎండీ వి. అనిల ఈ అవార్డును అందుకున్నారు.
TTD Alert: తిరుమల భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
తెలంగాణ(Telangana)లో పవన విద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అంచనా వేసింది. రాష్ట్రంలో 150 మీటర్ల హబ్ ఎత్తులో ఏకంగా 54,717 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో గాలి సాంద్రత అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. భవిష్యత్తు అవసరాల కోసం డేటాను సేకరించేందుకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 164 విండ్ మానిటరింగ్ మాస్ట్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 128.8 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ప్లాంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మిగిలిన అపారమైన అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం పారదర్శకమైన టారిఫ్ విధానం, భూ కేటాయింపులు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నామని రాష్ట్ర అధికారులు ఈ జాతీయ సదస్సు వేదికగా వెల్లడించారు.
