Telangana Government: రేషన్ కార్డు కావాలా? ఇక కేవలం 48 గంటల్లోనే.. తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ, అర్హులకు మరింత వేగంగా సేవలందించేందుకు సరికొత్త నిర్ణయాలను ప్రకటించింది.

Telangana government take steps to ensure that ration cards and pensions are delivered within 48 hours from now

  • 48 గంటల్లోనే రేషన్ కార్డులు
  • లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
  • రెండు లక్షల కొత్త పెన్షన్లు

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ, అర్హులకు మరింత వేగంగా సేవలందించేందుకు సరికొత్త నిర్ణయాలను ప్రకటించింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే పలు కీలక సంక్షేమ పథకాల పురోగతిని వెల్లడించారు.

Natural Gas Supply: గ్యాస్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డుల జారీ:

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చేలా 48 గంటల్లోనే కార్డు జారీ చేసేలా వ్యవస్థను రూపుదిద్దింది. ప్రజలు ప్రభుత్వ(Telangana Government) కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, దరఖాస్తు చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే పారదర్శకంగా కార్డు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రేషన్ ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, ఈ వ్యవస్థను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు.

లక్ష ఇందిరమ్మ ఇళ్లు – ఒంటరి మహిళలకు పెన్షన్లు:

పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో సుమారు లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకతతో అర్హులైన పేదలకే ఈ ఇళ్లను కేటాయిస్తామన్నారు. వీటితో పాటు, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్తగా ఆర్థిక భరోసా కల్పించేలా పెన్షన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.