Telangana Govt: భూ యజమానులకు శుభవార్త.. 22A ఆస్తుల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వం నుంచి ఐదు కీలక జీవోలు జారీ
22A నిషేధిత భూముల సమస్య పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అతిపెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
Telangana government takes a key decision on resolving 22A land issues.
Telangana Govt: దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 22A నిషేధిత భూముల సమస్య పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారులు, ఆస్తిదారులకు శాశ్వత ఉపశమనం కలిగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సమగ్రమైన కార్యాచరణను రూపొందించారు. నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ అనుమతి లేకుండానే ఇప్పటికే నివాస స్థలాలుగా, ఇళ్లుగా మారిన పట్టా భూములకు అధికారికంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు వీలుగా నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు.
AP Rains: బలపడిన ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
కలెక్టర్లకు పక్కా ఆదేశాలు, ఐదు కీలక జీవోల జారీ:
ఈ నిర్ణయం అమలు కోసం నిర్దేశిత నాలా రుసుము చెల్లించిన అర్హత గల భూములు, ప్లాట్లు, ఇళ్లకు వేగంగా రిజిస్ట్రేషన్(Telangana Govt) ప్రాసెస్ పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. నిర్ణీత కాలపరిమితిలో ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి పరిష్కరించే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఈ మొత్తం ప్రక్రియను వేగవంతం చేసేందుకు, భూ సమస్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఐదు విభిన్న జీవోలను సర్కారు విడుదల చేసింది.
GHMC, HMDA పరిధిలోని ఆస్తులకు భారీ ఉపశమనం:
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో GHMC, HMDA, DTCP, వివిధ మున్సిపాలిటీల ఆమోదం పొందిన 22A పరిధిలోని ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల యజమానులకు నేరుగా రిజిస్ట్రేషన్ హక్కులు లభిస్తాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా నానబెడుతూ వచ్చిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులను కూడా పరిరిష్కరించేలా స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనివల్ల వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలకు తమ సొంతింటి ఆస్తులపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు లభించి, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆశలు చిగురించాయి.
