Plastic Flowers Ban: తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూల విక్రయాలు నిషేధం.. కారణాలు ఇవే..

Telangana Government Ban Plastic Flowers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధించింది. పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్ లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Telangana Government Decision on Plastic Flowers Sale Ban

  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ప్రభుత్వ మార్కెట్లు, రైతు బజార్లలో..
    ప్లాస్టిక్‌ పూల విక్రయం నిషేధం
  • జరిమానాల విధింపుతోపాటు లైసెన్స్‌ రద్దు

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ పూల (plastic flowers) విక్రయాలను నిషేధించింది. ప్రభుత్వ మార్కెట్లు, పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్‌లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే జరిమానాల విధింపుతోపాటు లైసెన్స్ రద్దు చేయాలని సూచించింది. సహజ పూలను, వాటి ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని అన్ని జిల్లాల అధికారులకు నిర్దేశించింది.

Also Read : బుక్ చేసినా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాలేదా..? ఆలస్యం అవుతుందా.. వెంటనే ఇలా చేయండి.. మీ సమస్యకు సింపుల్ సొల్యూషన్

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల రైతు మేళాకు హాజరైన సమయంలో ప్లాస్టిక్ పూల విక్రయాల వల్ల సహజ పూల విక్రయాలు జరగడం లేదని, దీంతో తాము నష్టపోతున్నామని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో తుమ్మల స్పందిస్తూ మార్కెట్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలకు అనుమతిలేదని, వాటి విక్రయాలు అనుమతించొద్దని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా గతంలోనే ప్లాస్టిక్ పూల అమ్మకాలపై నిషేధం విధించాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై, ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించింది. ప్లాస్టిక్ కవర్ల వాడకం బదులు పేపర్, క్లాత్, జనపనారతో తయారు చేసే సంచులను ప్రజలు ఉపయోగించేలా ప్రోత్సాహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలు చేపట్టింది.

ఇదిలాఉంటే.. సమస్యను తెలియజేసిన వెంటనే పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్‌లలో ప్లాస్టిక్‌ పూల విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల పూల రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.