Kalyana Lakshmi Scheme: కల్యాణలక్ష్మి పథకంలో మార్పులు.. చెక్కుల పంపిణీ బంద్.. సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi Scheme), షాదీ ముబారక్ పథకాల విధానంలో త్వరలోనే కీలక మార్పులు రానున్నాయి.

Telangana government to deposit Kalyana Lakshmi scheme funds directly into bank accounts instead of issuing cheques

  • ఖాతాల్లోకే నేరుగా నగదు జమ
  • చెక్కుల పంపిణీ విధానానికి స్వస్తి
  • త్వరలోనే ప్రత్యేక వెబ్ పోర్టల్

Kalyana Lakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి(Kalyana Lakshmi Scheme), షాదీ ముబారక్ పథకాల విధానంలో త్వరలోనే కీలక మార్పులు రానున్నాయి. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక ఆసరాగా నిలిచే రూ. 1,00,116 సాయాన్ని ఇకపై చెక్కుల రూపంలో కాకుండా, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ వద్ద ప్రతిపాదనల ఫైలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఒక ప్రత్యేక పోర్టల్‌ను కూడా తీసుకురావడానికి కసరత్తు జరుగుతోంది.

Gold Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?

అనవసర జాప్యం.. పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు:

ప్రస్తుత విధానంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎమ్మార్వో, ఆర్డీవోల వెరిఫికేషన్, స్థానిక ఎమ్మెల్యేల ఆమోదం వంటి సుదీర్ఘ ప్రక్రియ వల్ల తీవ్ర ఆలస్యం జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో ఏడాది దాటినా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. అధికారులపై ఇతర పని ఒత్తిడులు పెరగడం వల్ల వెరిఫికేషన్ ముందుకు సాగడం లేదు. మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు చెక్కులు పంపిణీ చేసే సమయానికి వాటి గడువు ముగిసిపోతున్న ఘటనలు కూడా ఇటీవల వెలుగుచూశాయి. కొత్త విధానం వస్తే చెక్కుల ముద్రణ, రవాణా, ఆడిటింగ్ సమస్యలు పూర్తిగా తప్పుతాయి.

ఇంకా మారని ‘కల్యాణమస్తు’ పేరు:

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకం పేరును ‘కల్యాణమస్తు’గా మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా పాత పేరుతోనే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదేమైనా కొత్తగా తీసుకురాబోయే ప్రత్యేక పోర్టల్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా వివాహమైన వెంటనే లబ్ధిదారులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అత్యంత వేగంగా నగదు అందుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.