Rythu Bharosa Funds : రైతు భరోసా రెండో విడత నిధులు వచ్చేస్తున్నాయ్..! తేదీ ఫిక్స్.. ఎన్ని ఎకరాల వారికంటే?
Rythu Bharosa : యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో మొదటి విడతలో ఒక ఎకరం లోపు వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. రెండో విడత నిధులను..
Rythu Bharosa
- తెలంగాణలోని రైతులకు శుభవార్త
- రెండో విడత రైతు భరోసా నిధులు వచ్చేస్తున్నాయ్
- ఏప్రిల్ 22లోగా రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యే చాన్స్
- ఈనెలాఖరులోపు మూడో విడత నిధులు
Rythu Bharosa Funds : రైతులకు పంట సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతీయేటా ఎకరాకు రూ.12వేలు చొప్పున రెండు విడతల్లో అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రబీ సీజన్ కు సంబంధించి మూడు విడతల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి విడతలో నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
Also Read : Ration Card : తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై వారందరికీ రేషన్ కట్!
మొదటి దఫా నిధులను గత నెల23న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మొత్తం 68,89,955 మంది రైతులకు ఒక ఎకరం లోపు వరకు సొమ్మును వేసింది. 57,44,907.19 ఎకరాలకు మొత్తం రూ. 3,446.94కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే, ప్రస్తుతం రైతులు రెండో విడత నగదు కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి పంటలు చేతికొచ్చే సమయం దగ్గర పడుతుండడంతో సాధ్యమైనంత త్వరగా ఈనెలలోనే రైతు భరోసా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గత నెలలో మొదటి విడతలో ఒక ఎకరం లోపు వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈనెల 22లోపు రెండో విడత నిధులను, ఈ నెలాఖరు లోపు మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వాస్తవానికి రైతు భరోసా స్కీంను ఒక సీజన్లో అమలు చేయడానికి రూ.9వేల కోట్లు పైచిలుకు నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రెండో విడతలో భాగంగా ఈనెల 7వ తేదీన ఒకేసారి ప్రభుత్వం రూ. 3,900 కోట్లు రుణ తీసుకుంది. ఈ నెల 21న మరో రూ.3వేల కోట్లు అప్పు తీసుకోనుంది. ఇలా మొత్తం రూ. 6,900 కోట్లు ఖజానాలో ఉంటాయని తెలుస్తోంది. వాటి నుంచి రెండో దఫా రైతు భరోసాకు కొంతమేర నిధులు బదలాయించే అవకాశాలున్నట్లు తెలిసింది. రెండో దఫా కింద ఐదెకరాల వరకు సొమ్ము జమ చేయవచ్చునని సమాచారం. ఇందుకు రూ. 3వేల నుంచి రూ.4వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా, ఇక మూడో విడత ఈనెలాఖరు వరకు జమ చేసే అవకాశాలున్నాయి.
