Free Sewing Machines : రేవంత్ సర్కార్ శుభవార్త.. మహిళల కోసం మరో పథకం.. ఉచితంగా పంపిణీ

Free Sewing Machines : తెలంగాణ మహిళల కోసం రేవంత్ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది.

telangana government to provide free automatic sewing machines with 100 pc subsidy to women

  • తెలంగాణ మహిళలకు శుభవార్త
  • మరో కొత్త పథకం ప్రారంభం
  • 100 శాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ

Free Sewing Machines :

తెలంగాణలోని రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అర్హులైన మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పథకానికి సంబంధించి త్వరలోనే మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. అనంతరం అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే లక్ష్యంతో ఈ పథకం మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు.

బీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ

కుట్టు మిషన్ల పంపిణీతో పాటు ఆసక్తి కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి స్వయంగా ఉపాధి కల్పించనున్నారు. దీనిలో భాగంగా మహిళలకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది మహిళలు స్వయం ఉపాధి పొందటంతో పాటు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

కలెక్టర్ల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. కుట్టు మిషన్లు పంపిణీ చేయడమే కాకుండా మహిళలకు అవసరమైన ఇతర వనరులను సమకూర్చనున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలకు డిజైనింగ్, ఇతర పనుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.