Telangana Panchayat Raj: పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధుల విషయంలో కొత్త జీవో.. నేరుగా ఖాతాల్లోకే!

తెలంగాణలో గ్రామ పంచాయతీలు (Telangana Panchayat Raj)సమకూర్చుకున్న సొంత నిధులను నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసేలా ప్రభుత్వం జీవో 43 ద్వారా చట్ట సవరణ చేసింది.

Telangana govt issues go 43 for direct deposit of own funds into gram panchayats

Telangana Panchayat Raj: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థికంగా ఊతమిస్తూ, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలు(Telangana Panchayat Raj) తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకున్న ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ఖజానాకు మళ్లించే అవసరం లేకుండా, నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలంగాణ పంచాయతీ రాజ్ (నాల్గవ సవరణ) చట్టం, 2026ను అక్టోబర్ 9, 2026 నుంచి అమలులోకి తెస్తూ అధికారికంగా జీవో ఎంఎస్ నెం. 43ను జారీ చేసింది.

Hyderabad One Way Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఈ రూట్ లో కూడా వన్‌వే విధానం.. త్వరలోనే ట్రయిల్ రన్!

జాప్యానికి చెక్.. వేగవంతం కానున్న తాగునీరు, పారిశుధ్య పనులు:

గతంలో గ్రామ పంచాయతీలు సమకూర్చుకున్న సొంత నిధులను ముందుగా ప్రభుత్వ ఖజానాకు జమ చేసి, ఆ తర్వాత ప్రతి పనికి డ్రా చేసుకోవాల్సి వచ్చేది. ఈ సంక్లిష్టమైన ప్రక్రియ వల్ల పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, రహదారుల మరమ్మతులు వంటి అత్యవసర ప్రాథమిక పనులకు తీవ్రంగా జాప్యం జరిగేది. ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త సవరణతో నిధుల కొరత, సాంకేతిక ఆలస్యాలకు చెక్ పడి, గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకెళ్లనున్నాయి.

సర్పంచ్‌లకు అధికారాలు.. బలోపేతం కానున్న గ్రామ స్వరాజ్యం:

ఈ నూతన నిబంధనల ప్రకారం సొంత ఆదాయం నేరుగా పంచాయతీ ఖాతాల్లోనే అందుబాటులో ఉండటంతో, స్థానిక పాలకవర్గాలు ఉన్నతాధికారుల అనుమతుల కోసం కాలాపన చేయకుండా తక్షణమే నిధులను వినియోగించుకునే వెసులుబాటు లభించింది. నిధులు నేరుగా తమ చేతుల్లోనే ఉండటం వల్ల పాలనలో పారదర్శకత పెరగడమే కాకుండా, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమై గ్రామ పంచాయతీలు ఆర్థికంగా మరింత పటిష్టం కానున్నాయి.