Telangana Weather Today : తెలంగాణ ప్రజలకు బిగ్‌అలర్ట్.. నేటి నుంచి 25 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ
Telangana Weather Today : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- September 20, 2026 / 08:08 AM IST
Telangana Rains
Telangana Weather Today : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభాబంతో నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే, ఇవాళ (ఆదివారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. నేడు ఈ జిల్లాలతోపాటు.. వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలతోపాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మరో నాలుగు రోజులపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
