Inter Results : ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లోనూ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
Inter Results: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలకానున్న నేపథ్యంలో ఫలితాలను విద్యార్థులు వాట్సాప్‌లోనూ చెక్ చేసుకొనే అవకాశంను ప్రభుత్వం కల్పించింది.
- Harishth Thanniru
- Published On : April 11, 2026 / 01:22 PM IST
Inter Results
- రేపే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు
- వాట్సాప్‌లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
- అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం
Inter Results : ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ ఫ్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విడుదల చేయనున్నారు. అయితే, ఫలితాలను మొబైల్ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. క్షణాల్లో మీ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
Also Read : Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త..
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలకానున్న నేపథ్యంలో ఫలితాల కోసం విద్యార్థులు ఎటువంటి పోర్టల్ లాగిన్ అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా.. మీ మొబైల్ లో వాట్సాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 8096958096 (WhatsApp)కు మెసేజ్ పంపడం ద్వారా అన్ని సేవలను యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ ద్వారా నేరుగా పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
♦ 8096 95 8096ని మీ కాంటాక్ట్‌లలో “MeeSeva Telangana”గా సేవ్ చేయండి
♦ WhatsApp తెరిచి ఆ నెంబర్‌కు “Hi” పంపండి.. మీసేవ చాట్‌బాట్ మొదలవుతుంది.
♦ “BIE Exam Result” టైప్ చేసి Open Service నొక్కండి
♦ మీ రోల్ నంబర్ నమోదు చేయండి
♦ సంవత్సరం (1వ/2వ), స్ట్రీమ్ (జనరల్/వొకేషనల్) ఎంచుకోండి. ఆ తరువాత సబ్మిట్ చేయండి.
♦ మీ ఫలితం WhatsAppలో తక్షణమే వస్తుంది.
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4,89,126 మంది ఉండగా.. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు.
