Inter Supplementary Exam Fee Extended : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
Inter Supplementary Exam Fee Extended : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. సప్లీమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగించారు.
- Dharani Pilli
- Updated on- April 21, 2026 / 01:55 PM IST
Telangana Inter Supplementary Exam 2026 Fee Deadline Extended
Inter Supplementary Exam Fee Extended : తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 23 వరకు గడువు ఇచ్చారు. జనరల్, వోకేషనల్ విభాగాల్లోని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ గడువులోగా ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చని బోర్డు స్పష్టం చేసింది.
మే 13 నుంచి 21 వరకు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రధాన సబ్జెక్టులు మాత్రం మే 19వ తేదీతోనే ముగుస్తాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరగనున్నాయి. గత ఫిబ్రవరిలో ఎవరైనా ప్రయోగ పరీక్షలకు (Practicals) హాజరుకాని వారుంటే వారికి మే 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఆంగ్లం ప్రాక్టికల్ పరీక్షలను మే 26న జరుపుతారు. ఇప్పటి వరకు సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారని అధికారులు వెల్లడించారు.
