Telangana Rains: తెలంగాణలో మారిన వాతావరణం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్!

తెలంగాణవ్యాప్తంగా(Telangana Rains) నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Meteorological Department has announced heavy rains for next three days.

  • రానున్న మూడు రోజులు హెచ్చరిక
  • ఆరు జిల్లాలకు వర్ష సూచన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

Telangana Rains: తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గి, చల్లటి గాలులు వీస్తున్నాయి. రాబోయే మూడు రోజుల కాలంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

New Aadhaar Rules: హోటల్స్ లో ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారా? ఇకపై అవసరం లేదు.. రూల్స్ మారిపోయాయి

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు – ఏయే జిల్లాలకు అలర్ట్:

రానున్న 72 గంటల్లో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు స్థానిక వాతావరణ శాఖ అప్రమత్తత జారీ చేసింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చినుకులు పడే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణ శాఖ సూచనలు – ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకూడదని ప్రజలను హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు ప్రయాణాల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.