Konda Surekha : సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నాకేం సంబంధం? కొండా సురేఖ వివరణ
Konda Surekha : కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు పంపిన నోటీసులను విత్ డ్రా చేసుకోవాలని పీసీసీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.
- Sreehari A
- Updated on- August 20, 2026 / 05:20 PM IST
Konda Surekha
- నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు
- పీసీసీ నోటీసులపై కొండా సురేఖ వివరణ
- టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ
- కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి రిప్లయ్
Konda Surekha : కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకేం సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి లేఖలో వివరణ ఇచ్చారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తనకు పీసీసీ నోటీసులు జారీ (Konda Surekha) చేసిన నేపథ్యంలో గురువారం (ఆగస్టు 20) కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి లేఖ రూపంలో క్లారిటీ ఇచ్చారు. సుస్మిత వ్యక్తిగత అభిప్రాయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
Read Also : Telangana Movie Tickets : టికెట్ ధరలపై తెలంగాణలో థియేటర్ల వార్.. ప్రభుత్వ జీఓపై ఎగ్జిబిటర్ల అభ్యంతరం!
కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత వ్యాఖ్యలకు మరొకరిని రాజకీయంగా బాధ్యులను చేయడం న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సుస్మిత వ్యాఖ్యల వెనక తన ప్రమేయం లేదని గుర్తించాలని తనకు జారీ చేసిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో కోరారు. పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందన్నారు.
Minister Konda Surekha Letter
