Telangana Power Employees : విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుతో వేలాది కుటుంబాలకు ఊరట!
Telangana Power Employees : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏ 19.272 నుంచి 21.815 శాతానికి పెంచింది. 71,360 మందికి ప్రయోజనం కలగనుంది. జూలై 1 నుంచి అమల్లోకి రానుంది..
- Sreehari A
- Published on- October 30, 2026 / 06:31 PM IST
Telangana Power Employees
- విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు
- 19.272 నుంచి 21.815 శాతానికి పెంపు.. జూలై 1 నుంచి వర్తింపు
- 71,360 మందికి ప్రయోజనం.. నెలకు రూ.14.63 కోట్ల అదనపు భారం
Telangana Power Employees : తెలంగాణలో విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, విశ్రాంత సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరుగుతున్న ఖర్చుల మధ్య ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించేలా కరువు భత్యం (DA), కరువు సాయం (DR) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్ సంస్థల (Telangana Power Employees) ఉన్నతాధికారులు పెంపునకు సంబంధించిన చర్యలు చేపట్టాలని సూచించారు. తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు 19.272 శాతంగా ఉన్న డీఏ 21.815 శాతానికి చేరింది. ఈ పెంపు 2026 జూలై 1 నుంచి వర్తించనుంది.
Read Also : Singareni Diwali Bonus : సింగరేణి కార్మికులకు దీపావళి కానుక.. ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్!
71,360 మందికి లబ్ధి :
ఈ నిర్ణయం వల్ల విద్యుత్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి మొత్తం 71,360 మందికి ప్రయోజనం కలగనుంది. పెరిగిన డీఏ, డీఆర్ కారణంగా ప్రతి నెలా సుమారు రూ.14.63 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది. ఉద్యోగుల ఆదాయానికి కొంత అదనపు మద్దతు లభించడంతో పాటు పదవీ విరమణ చేసిన వారికి కూడా ప్రయోజనం చేకూరనుంది.
విద్యుత్ రంగంపై దీర్ఘకాలిక ప్రణాళిక :
కేవలం ఉద్యోగుల సంక్షేమానికే పరిమితం కాకుండా రాష్ట్ర విద్యుత్ రంగ భవిష్యత్తుపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే పదేళ్ల అవసరాలను అంచనా వేస్తూ దీర్ఘకాలిక విద్యుత్ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు.
