Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో మార్పు.. 48 గంటల్లో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణ(Telangana Rains)లో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rain forecast for Telangana over the next two days.

  • 23 జిల్లాలకు అలర్ట్
  • భారీ వర్షాల హెచ్చరిక
  • ఈదురుగాలులతో కూడిన వానలు

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారింది. కొన్ని రోజులుగా సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ, రానున్న 48 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

KTR: 2028 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. జిందాల్ వర్సిటీ విద్యార్థుల ప్రశ్న.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

23 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ:

హైదరాబాద్ వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ (Telangana Rains) జారీ చేయబడింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

అధికారుల ముందస్తు చర్యలు:

వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ల వద్ద నిలబడవద్దని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. వర్షపు నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున జీహెచ్‌ఎంసీతో పాటు జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు, స్థానిక ప్రజలు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.