Telangana Ration Card : తెలంగాణ ప్రజలకు డబుల్ ధమాకా.. ఒకేసారి 2 పథకాలు.. రేషన్ కార్డు ఉంటే చాలు..!

Telangana Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభంతో పాటు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనుంది..

Telangana Ration Card

  • రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
  • తెలంగాణలో మహిళలకు డబుల్ ధమాకా
  • మహిళలకు చీరలు, కుటుంబానికి రూ.5 లక్షల బీమా

Telangana Ration Card : తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒకేసారి రెండు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీగా ప్రయోజనం కలగనుంది..

కుటుంబానికి రూ.5 లక్షల బీమా :
ఈ రెండు కార్యక్రమాల్లో ఇందిరమ్మ బీమా పథకం ప్రత్యేక ఆకర్షణ.. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు రూ.5 లక్షల బీమా పరిహారం అందించనున్నారు. సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు..

మహిళలకు ఇందిరమ్మ చీరలు :
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నవంబర్ 19న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాలు, మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ ప్రారంభం కానుంది.

Read Also : CII Summit 2026 : ఏపీకి పెట్టుబడుల జాతర.. రూ.9.89 లక్షల కోట్లతో భారీ డీల్స్.. ఉద్యోగాలపై చంద్రబాబు కీలక ప్రకటన!

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది.. ఇందుకోసం రూ.334 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి చీరల రంగు, డిజైన్‌లోనూ మార్పులు చేశారు. చిలుకపచ్చ రంగు బాడీకి ఎరుపు రంగు పట్టు, జరీ అంచులతో ఆకర్షణీయంగా రూపొందించారు.

చీరలు ఎలా తీసుకోవాలి? :
చీరల పంపిణీ కేంద్రాలకు మహిళలు తమ రేషన్ కార్డు తీసుకెళ్లాలి. అక్కడ అధికారులు వివరాలు రిజిస్టర్ చేసి చీరలు అందిస్తారు. వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు కుటుంబానికి బీమా భరోసా, మరోవైపు మహిళలకు చీరల పంపిణీతో నవంబర్ 19 తెలంగాణలో ప్రత్యేకంగా నిలవనుంది..