×
Ad

గుడ్‌న్యూస్‌.. రైతులు బ్యాంక్‌ ఖాతాలు వెంటనే చెక్‌ చేసుకోండి..

ఖరీఫ్‌లో సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి బోనస్ బకాయిలు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • సన్న వడ్లు బోనస్ బకాయిల విడుదల
  • రూ.514.36 కోట్లు రిలీజ్ చేసిన సర్కారు
  • క్వింటాల్‌కు రూ.500 చొప్పున నేరుగా జమ

Telangana: తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్ చెల్లింపులను విడుదల చేసింది. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బకాయిలను ఇప్పుడు క్లియర్ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 2.17 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమవుతున్నాయి. తెలంగాణ పౌర సరఫరాల ఈ వివరాలను వెల్లడించింది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 2.17 లక్షల మంది రైతులు సన్న వడ్లను సాగు చేశారు.

Also Read: ఇది “శుభలగ్నం” సినిమా కాదు.. మరో మహిళ నుంచి రూ.1.5 కోట్లు తీసుకుని భర్తను నిజంగానే ఇచ్చేసి..

ఖరీఫ్‌లో సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి బోనస్ బకాయిలు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బకాయిల రూ.514.36 కోట్ల నిధులను తెలంగాణ సర్కారు విడుదల చేసింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 1,939.58 కోట్ల రూపాయల బోనస్‌ చెల్లింపులు జరిగాయి.

పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతులకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి బోనస్‌ను అందిస్తోంది. ఈ ప్రోత్సాహకం రాష్ట్రంలో సన్న వడ్ల సాగును గణనీయంగా పెంచింది.