TS RTC Special buses : కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు.. ఈ ప్రాంతాల నుంచే..
TS RTC Special buses : కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (వీసీ అండ్ ఎండీ) వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
- Harish Thanniru
- Published on- May 22, 2026 / 10:15 AM IST
saraswati pushkaralu 2026
- కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు
- టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు
- ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు
TS RTC Special buses : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతోపాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రమే కాళేశ్వరం.. దేశంలో ప్రయాగ్‌రాజ్ తరువాత ఇలాంటి త్రివేణి సంగమం ఉన్న రెండో ప్రదేశం ఇదే. దీంతో ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోయి, పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల పగ్రగాఢ విశ్వాసం. ఈ పుష్కరాలు 12రోజుల పాటు జరుగుతాయి. పుష్కరాలకు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 20 నుంచి 30లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, పుష్కరాలకువెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (వీసీ అండ్ ఎండీ) వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించేందుకు కాళేశ్వరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా, వారి ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగేలా అధునాతన బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
హైదరాబాద్, నర్సంపేట, తొర్రురు, భూపాలపల్లి, మణుగూరు, కరీంనగర్, మంథని, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, పరకాల, నిజామాబాద్, గోదావరి ఖని, మంచిర్యాల వంటి ముఖ్య ప్రాంతాల నుండి నేరుగా కాళేశ్వరానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ల కొరకు టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. భక్తులందరూ ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని, సురక్షితమైన వాతావరణంలో కాళేశ్వర సరస్వతి పుష్కరా లయాత్రను విజయవంతం చేసుకోవాలని వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి కోరారు.
