Driving License: తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటినుంచే డ్రైవింగ్ లైసెన్స్.. వారంరోజుల్లోనే!

తెలంగాణలో వాహనదారులు ఏఐ సాంకేతికతతో ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష(Driving License) రాసేలా రవాణా శాఖ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది.

Telangana rto to introduce ai powered online llr test from home facility

Driving License: వాహనాలు నడపడం నేర్చుకోవాలనుకునే తెలంగాణ వాహనదారులకు రవాణా శాఖ బిగ్ రిలీఫ్ ఇస్తూ ఒక సరికొత్త డిజిటల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. లెర్నర్‌ లైసెన్స్‌ (Driving License) పొందడానికి ఇకపై గంటల తరబడి ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ సొంతింటి నుంచే ఆన్‌లైన్ పరీక్ష రాసే వెసులుబాటును కల్పించేందుకు రవాణా శాఖ వేగంగా కసరత్తు చేస్తోంది. ‘సారథి’ న్యూ లెర్నర్ లైసెన్స్ విధానంతో పాటు కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమైతే, మరో వారంలోనే దీనిని అమల్లోకి తేనున్నారు.

Cheyutha Pensions: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. నేటినుంచే కొత్త పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా!

ఏఐ సాంకేతికతతో ఫేషియల్ రికగ్నిషన్.. పరీక్షలో పారదర్శకతకు పెద్దపీట:

ఈ అధునాతన విధానంలో అభ్యర్థులు తమ ఇంటి నుంచే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ‘సెక్యూర్డ్ బ్రౌజర్’లో పరీక్ష రాయవచ్చు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకత కోసం ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అభ్యర్థి వ్యక్తిగత ధ్రువీకరణ పూర్తి చేస్తారు. పరీక్ష జరుగుతున్నంత సేపు ఏఐ వ్యవస్థ అభ్యర్థి కదలికలను కెమెరా ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంది. అభ్యర్థి స్క్రీన్ ముందు నుంచి పక్కకు తప్పుకున్నా, మరొక వ్యక్తి కెమెరా ముందుకు వచ్చినా, వేరే వెబ్‌సైట్లు తెరవడానికి ప్రయత్నించినా ఏఐ సిస్టమ్ తక్షణమే హెచ్చరిక జారీ చేస్తుంది.

సాంకేతిక సమస్యలొస్తే ఆర్టీవో ఆప్షన్.. దరఖాస్తుదారులకు పూర్తి సులభతరం:

ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా ముఖ గుర్తింపు (ఫేషియల్ వెరిఫికేషన్) పలుమార్లు విఫలమైతే, అభ్యర్థి మొబైల్ ఫోన్‌కు సురక్షితమైన ఓటీపీ (OTP) పంపిస్తారు. సదరు ఓటీపీ ఆధారంగా అభ్యర్థులు తమకు సమీపంలోని ఆర్టీవో కార్యాలయానికి నేరుగా వెళ్లి పరీక్ష రాసే ప్రత్యామ్నాయ వెసులుబాటును కూడా రవాణా శాఖ కల్పించింది. ఈ డిజిటల్ విప్లవంతో సమయం కలిసిరావడంతో పాటు ఆఫీసుల్లో దళారుల వ్యవస్థకు ముగింపు పడనుండటంతో వాహనదారులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.