స్కూళ్లు ఇంకా తెరవలేదు.. అప్పుడే ఈ ఏడాది సెలవుల లిస్ట్ వచ్చేసింది.. దసరా, దీపావళి, సంక్రాంతి సెలవులు ఎప్పుడెప్పుడంటే..

లంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక(TS School academic calendar)ను అధికారికంగా విడుదల చేసింది.

Telangana School academic calendar 2026-27 released check important dates here

  • కొత్త క్యాలెండర్‌లో 227 పనిదినాలు.
  • ఫిబ్రవరికల్లా సిలబస్ పూర్తి చేయాలి.
  • ఏప్రిల్ 24 నుండి సమ్మర్ హాలిడేస్.

TS School academic calendar: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 2026-27 (TS School academic calendar)విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను అధికారికంగా విడుదల చేసింది. విద్యా ప్రమాణాలను పెంచేలా, సకాలంలో పరీక్షల నిర్వహణకు వీలుగా ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మొత్తం 227 పనిదినాలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Mekapati Chandrasekhar Reddy: మేకపాటి కుటుంబంలో ఆస్తి వివాదం.. పరువు బజారుకీడుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు!

సిలబస్ పూర్తికి గడువు & పండుగ సెలవులు:

పాఠశాలల్లో బోధనా సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా విద్యాశాఖ కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 2027 ఫిబ్రవరి 28 లోగా సిలబస్ మొత్తాన్ని పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించింది.

ఇక విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగ సెలవుల వివరాలను కూడా ముందుగానే ప్రకటించింది:

  • దసరా సెలవులు: అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు (మొత్తం 13 రోజులు) పాఠశాలలు మూతపడనున్నాయి.
  • సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుంచి జనవరి 17 వరకు (మొత్తం 5 రోజులు) సెలవులు ఉంటాయి.

చివరి పనిదినం & వేసవి సెలవులు:

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ముగింపు తేదీలను కూడా క్యాలెండర్‌లో పొందుపరిచారు. 2026-27 విద్యా సంవత్సరపు ఆఖరి పనిదినం (Last Working Day) 2027 ఏప్రిల్ 23 గా నిర్ణయించారు. ఆ మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు (Summer Holidays) ఉంటాయని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ ముందస్తు షెడ్యూల్ వల్ల అటు పాఠశాల యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి వీలవుతుంది.