×
Ad

Telangana Cabinet Meeting : ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది.

  • Published On : December 6, 2022 / 08:06 AM IST

Telangana cabinet meeting

Telangana cabinet meeting : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగున్న ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించే అవకాశం ఉంది. స్వంత స్థలాలు ఉన్న బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన మహబూబ్ నగర్ లోని బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

CM KCR Inaugurated : మహబూబ్‌నగర్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

ఈ నేపథ్యంలో రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు పథకం అమలు వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. శనివారం జరుగనున్న కేబినెట్ సమావేశానికి వివిధ శాఖల మంత్రులు హాజరుకానున్నారు.