TG TET : టెట్ నోటిఫికేషన్ విడుదల.. జూన్ నెలలో పరీక్షలు.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడంటే? పూర్తి వివరాలు ఇలా..
TG TET : తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రదఖాస్తులు స్వీకరించనున్నారు.
- Harishth Thanniru
- Published On : April 13, 2026 / 12:34 PM IST
TET 2026 Notification
- తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
- ఏప్రిల్ 15 నుంచి 30వరకు దరఖాస్తుల స్వీకరణ
- జూన్ 15 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణ
TG TET : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు సిద్ధమవుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో 2026 సంవత్సరానికి సంబంధించి సోమవారం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 9నుంచి హాల్ టికెట్లు జారీ చేస్తారు. జూన్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించడం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో ప్రాథమిక పాఠశాల (క్లాస్ 1-5) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. పేపర్-2లో ఉన్నత ప్రాథమిక పాఠశాల (క్లాస్ 6-8) ఉపాధ్యాయ అర్హతకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఒకే పేపర్ లేదంటే రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జులై 28 నుంచి 31వ తేదీల మధ్యలో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే, ఒకపేపర్ కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 పరీక్షా ఫీజు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ కల్పించనున్నారు.
టెట్ పేపర్ -1కు దరఖాస్తు చేసుకోవాలంటే D.El.Ed లేదా B.Ed (ప్రాథమిక) అర్హత ఉండాలి.
పేపర్ -2కు దరఖాస్తు చేసుకోవాలంటే పేపర్-2కు B.Ed లేదా సంబంధిత విద్యా అర్హత అవసరం. కనీసం 50శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు.
ప్రతీయేటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు యేటా రెండు సార్లు టెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాదికి తొలి విడత పరీక్షకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యాశాఖ అధికారులు ఇటీవలే ప్రతిపాదనలు పంపగా.. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అనుమతి ఇచ్చారు. దీంతో తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదలైంది.
