TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ప్లేస్ ఆ జిల్లాదే.. వాట్సాప్‌లో ఫలితాలు ఇలా తెలుసుకోండి..
TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి.
- Harishth Thanniru
- Published On : April 12, 2026 / 10:57 AM IST
TS Inter Results 2026
TS Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి మొత్తం 9.70,075 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఫస్ట్ ఇయర్ లో 4,89,126 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ లో 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో 66.20శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 74.40శాతం మంది, బాలురు 57.69శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70.58శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 78.65 శాతం, బాలురు 62.50శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో టాప్ స్థానంలో నిలవగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
విద్యార్ధులకు సబ్జెక్ట్ వైజ్ మార్కుల మెమోలను ఆదివారం (ఏప్రిల్ 12) సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఫలితాలను https://10tv.in/లో చూడొచ్చు.
ప్రభుత్వ సలహాదారు కేశవరావు మాట్లాడుతూ.. ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. మంచి పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని చెప్పారు.
విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా మాట్లాడుతూ.. పాసైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక నెలలోనే సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు. సప్లమెంటరీ పరీక్షల్లో పాస్ అయినవారు డిగ్రీలో రెగ్యులర్ స్టూడెంట్‌గా వాళ్ళుకూడా ముందుకు వెళ్లవచ్చునని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈసారి సెకండియర్ విద్యార్థులు ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. బీసీ వెల్ఫేర్ కళాశాల పిల్లల పాస్ పర్సంటేజ్ బాగా పెరిగిందని యోగితా రానా తెలిపారు. బాలికలు ఎక్కువమంది ఉత్తీర్ణత సాధించారని, 76.55శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ సంవత్సరం నుండి అందరికీ మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ ఏడాది నుండి బ్రేక్ ఫాస్ట్ ఉంటుందని, అందులో రాగి జావా, పాలు వంటి సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశామని, అనేక మంచి సదుపాయాలు కల్పించామని, కళాశాలలో అందువల్లే పదివేల మంది పిల్లలు గత చేయడానికి ఎక్కువగా వచ్చారని యోగితా రానా పేర్కొన్నారు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం..
♦ ముందుగా మీ మొబైల్‌లో 8096 95 8096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
♦ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి.
♦ వచ్చే రిప్లైలో ‘మెనూ’ (Menu) పై క్లిక్ చేసి ‘BIE Exam Result’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
♦ అనంతరం ‘Open Service’ బటన్ నొక్కండి.
♦ అక్కడ మీ హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను ఎంటర్ చేయండి.
♦ ఆ తరువాత మీ ఫలితం, మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
