Telangana Rains: తెలంగాణలో ఎల్లో అలర్ట్, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నాయి. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. బుధ, గురు వారాల్లో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain

 

 

Telangana Rains: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నాయి. దీంతో బుధవారం నుంచి తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడనుంది. బుధ, గురు వారాల్లో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మధ్యాహ్న సమయానికి నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం భారీగా కురుస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో భారీగా కురుస్తుంది.

Read Also : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు..మోస్తరు నుంచి భారీ వర్షాలు

కల్వకుర్తిలో అత్యధికంగా 125.8 మిల్లీ మీటర్లు, వనపర్తిలో 114.3 మి.మీ, నాగర్ కర్నూల్‌లో 100.3 మి.మీ, రంగారెడ్డి జిల్లాలో 100 మి.మీ వర్షపాతం నమోదైనట్లు సమాచారం.