TGPSC Syllabus: పోటీ పరీక్షల సిలబస్ మార్పు.. TGPSC క్లారిటీ.. నిరుద్యోగులకు ఊరట!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పు వార్తలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Syllabus) స్పష్టతనిచ్చింది.

TGPSC clarifies on rumours about change in syllabus of competitive exams

TGPSC Syllabus: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు జరగనున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Syllabus) స్పష్టతనిచ్చింది. ఈ తరహా ఊహాగానాలు, ప్రచారాలు చూసి గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా, నిరుద్యోగులు, అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులు, వ్యక్తమైన సందేహాలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. తమ వైఖరిని తెలియజేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Ap Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

సిలబస్ కమిటీ ఏర్పాటు చేయలేదు:

పోటీ పరీక్షల సిలబస్‌ను పునర్వ్యవస్థీకరించడానికి ఎలాంటి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, వాటిని ఎవరూ నమ్మకూడదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పాత సిలబస్ ప్రకారమే ప్రిపరేషన్ కొనసాగించుకోవాలని సూచించింది.

మార్పులు ఉంటే ఏడాది ముందే ప్రకటిస్తాం:

పోటీ పరీక్షల సిలబస్‌లో ఏదైనా పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి వస్తే, అభ్యర్థులు సిద్ధమవ్వడానికి కనీసం ఒక సంవత్సరం ముందే ఆ సమాచారాన్ని అందిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. ఒకవేళ ఏవైనా స్వల్ప మార్పులు మాత్రమే ఉంటే, సంబంధిత ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌తో పాటే ఆ వివరాలను పొందుపరుస్తామని వివరించారు.