TGPSC Job Notification : నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్.. 102 పోస్టులు.. రూ.లక్షకుపైగా జీతం
TGPSC Job Notification : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- Harish Thanniru
- Updated on- October 28, 2026 / 10:45 PM IST
TGPSC Job Notification
TGPSC Job Notification : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. మంచి జీతంతో ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునేందుకు మరో అవకాశం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 102 ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also Read : Bank Holidays November 2026 : నవంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. తేదీలివే..
టీజీపీఎస్సీ వివరాల ప్రకారం.. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్లో ఖాళీగా ఉన్న మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (MPSO) / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (ASO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు జోనల్ కేడర్ పరిధిలోకి వస్తాయి. మొత్తం 102 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. 2026 జులై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18ఏళ్లు.. గరిష్ఠంగా 44 ఏళ్లు ఉండాలి.
విద్యార్హతల విషయానికొస్తే.. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పొంది ఉండాలి. స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా.. మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో కనీసం ఒక సంవత్సరం లేదా రెండేళ్లు/మూడేళ్లు స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివిన అభ్యర్థులు కూడా అర్హులే.
అర్హులైన అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ పే స్కేల్ ర ూ.36,750 నుంచి రూ. 1,06,990 వరకు ఉంటుంది. పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు.. ఎంపిక విధానం, పరీక్షా విధానం, దరఖాస్తు నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://www.tgpsc.gov.in
