TGPSC: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. జలమండలిలో 130 పోస్టలు.. టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది.
- V Santhosh Kumar
- Published on- September 18, 2026 / 08:49 PM IST
tgpsc water board manager engineering recruitment notification
TGPSC: తెలంగాణలోని నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తీపి కబురు అందించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో మల్టీ జోన్-2 పరిధి కింద ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రారంభ వేతనంగా నెలకు రూ. 54,220 నుండి గరిష్టంగా రూ. 1,33,630 వరకు భారీ జీతంతో కూడిన పే-స్కేల్ లభించనుంది.
అర్హతలు, వయోపరిమితి వివరాలు.. సివిల్, ఎలక్ట్రికల్ అభ్యర్థులకు మంచి అవకాశం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మొత్తం ఖాళీల్లో 80% పోస్టులు సివిల్ ఇంజనీరింగ్‌కు, 15% ఎలక్ట్రికల్/మెకానికల్‌కు, 5% సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాల అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఓసీ/బీసీలకు రూ. 1000 కాగా, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ. 500 గా నిర్ణయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు, పరీక్షా విధానం.. ముఖ్యమైన తేదీలు ఇవే:
తగిన అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 23, 2026 నుంచి అక్టోబర్ 17, 2026 సాయంత్రం 5 గంటల వరకు TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులందరికీ పరీక్ష ఫీజు మినహాయింపు లభించనుంది. రాత పరీక్షను డిసెంబర్ 2026లో ఆన్‌లైన్ (CBRT) లేదా OMR పద్ధతిలో నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ – 150 మార్కులు), పేపర్-2 (ఇంజనీరింగ్ సబ్జెక్ట్ – 300 మార్కులు) మొత్తం 450 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
