elder brother killed younger brother : హైదరాబాద్‌ షేక్‌పేటలో దారుణం : మద్యం మత్తులో తమ్ముడిని కొట్టి చంపిన అన్న

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన అన్నదమ్ములు తీవ్రంగా కొట్టుకోగా.. తమ్ముడు చనిపోయాడు.

  • Updated on- March 17, 2021 / 11:52 AM IST

The Elder Brother Killed His Younger Brother

The elder brother killed his younger brother : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన అన్నదమ్ములు తీవ్రంగా కొట్టుకోగా.. తమ్ముడు చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. షేక్‌పేటకు చెందిన నరేందర్‌, విజయ్‌లు అ న్నదమ్ములు. నిన్నరాత్రి మద్యం మత్తులో ఇద్దరు గొడవపడ్డారు. అన్న నరేందర్‌ కర్రతో తలపై గట్టిగా కొట్టడంతో తమ్ముడు విజయ్‌ చనిపోయాడు.

రాత్రి 11.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు అతన్ని వారించే ప్రయత్నం చేసినప్పటికీ అన్న నరేందర్ ఊడెన్ కర్రతో తలపై బలంగా కొట్టడంతో తమ్ముడు విజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ పేట నాలా పక్కనే విజయ్ మృతదేహం పడి ఉంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అన్న నరేందర్..తమ్ముడు విజయ్ ను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

గత కొంతకలంగా వీరి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు రాత్రి నిందితుడు నరేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.