Three Minor Girls Missing: హైదరాబాద్‌లో కలకలం.. ఒకేసారి ముగ్గురు బాలికలు మిస్సింగ్.. ఫుటేజ్ చూసి షాక్ అయిన పోలీసులు
హైదరాబాద్ నగరం దోమలగూడ ప్రాంతంలో ఒకేసారి ముగ్గురు మైనర్ బాలికలు(Three Minor Girls Missing) మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది.
- V Santhosh Kumar
- Updated on- July 20, 2026 / 06:13 PM IST
Three minor girls missing from Domalguda, Hyderabad police investigation started
- హైదరాబాద్‌లో ముగ్గురు బాలికల మిస్సింగ్
- సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తింపు
- పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు
Three Minor Girls Missing: హైదరాబాద్ నగరం దోమలగూడ ప్రాంతంలో ఒకేసారి ముగ్గురు మైనర్ బాలికలు మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలు ఫరీద్ బస్తీలో నివాసం ఉంటుండగా, వారి పిల్లలైన సహిత కుమారి, స్నేహ కుమారి, లత ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Abhijit Deepke Arrest: ఢిల్లీలో ‘చలో సంసద్’ ఉద్రిక్తత.. అభిజీత్ దీప్కే అరెస్ట్
పరిశీలించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలికలు(Three Minor Girls Missing) మొదట హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు, అక్కడి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికలు తమ స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌కు ప్రయాణమై ఉండొచ్చనే అనుమానంతో రైల్వే పోలీసులు, ఇతర జిల్లాల పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ విచారణ వేగవంతం చేశారు. స్టేషన్లలోని కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. పిల్లల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోగా, త్వరలోనే వారిని సురక్షితంగా తీసుకొస్తామని పోలీసులు తెలిపారు.
