Uppal Traffic Restrictions: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు
మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వినియోగించాలని అధికారులు సూచించారు.
- Naveen
- Published on- May 21, 2026 / 06:00 PM IST
Uppal Traffic Restrictions: హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మే 22న ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ చివరి మ్యాచ్ జరగనుంది. SRH (సన్ రైజర్స్ హైదరాబాద్), RCB (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకుల రద్దీ ఉండనుంది. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. హెవీ వాహనాలపై ఆంక్షలు పెట్టారు. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లకు ప్రత్యేక డైవర్షన్లు ఇచ్చారు.
ఘట్‌కేసర్, ఎల్బీనగర్, తార్నాక, రామంతాపూర్ మార్గాల్లో ట్రాఫిక్ మార్పులు చేశారు. వరంగల్ రోడ్‌పై కీలక మార్పులు చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో వరంగల్ రహదారి మూసివేశారు. ORR ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. స్టేడియం దగ్గర ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పెంగ్విన్, TGIALA, DSL ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. VIP/VVIP పాస్ హోల్డర్లకు మాత్రమే స్టేడియం లోపల పార్కింగ్ కు పర్మిషన్ ఇచ్చారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వినియోగించాలని అధికారులు సూచించారు. ఉప్పల్ మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.
Also Read: కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు
