Road Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఏఎస్‌ఐపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. చికిత్స పొందుతూ..

Road Accident : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవింద్ నాయక్‌ను పోలీస్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని హోంగార్డు రామారావు డ్రైవ్ చేస్తున్నాడు. అతను పరారీలో ఉన్నాడు.

Road Accident

  • సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
  • ఏఎస్ఐ గోవింద్ నాయక్‌ను పోలీస్ వాహనం ఢీకొట్టింది
  • పరారీలో హోంగార్డు రామారావు

Road Accident : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఏఎస్ఐ గోవింద్ నాయక్ ను పోలీసు వాహనమే బలితీసుకుంది. మానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గోవింద్ నాయక్ స్టేషన్ ముందు నిలబడి ఉండగా.. పోలీసు వాహనం ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లింది.

Also Read : Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ CISF అధికారి హల్‌చల్.. మహిళలను టార్గెట్‌గా చేసుకొని.. ఏకంగా 65మందిని..

హోంగార్డు రామారావు వాహనాన్ని నడుపుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా దూసుకెళ్లి గోవింద్ నాయక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్ నాయక్ కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సిబ్బంది వెంటనే అప్రమత్తమై చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ గోవింద్ నాయక్ మృతి చెందాడు.

ప్రమాదానికి కారణమైన హోంగార్డు రామారావు ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న హోంగార్డు రామారావుకోసం పోలీసులు గాలింపును ప్రారంభించారు. అయితే, పాత కక్షల నేపథ్యంలోనే హోంగార్డు రామారావు కావాలని ఏఎస్ఐ పైకి వాహనాన్ని ఎక్కించాడని బాధిత కుటుంబ షభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.