TS inter results 2026 : తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు..! ఇలా చెక్ చేసుకోండి
TS inter results 2026 : అనుకున్నది అనుకున్నట్లు జరిగితే శనివారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. శనివారం ఫలితాలు వెల్లడి కాకుంటే.. ఆదివారం లేదా సోమవారం ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించేందుకు సిద్ధమైంది.
TS inter results 2026
- తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
- ఫలితాలు వెల్లడించే తేదీపై క్లారిటీ
- 11న ఫలితాలు విడుదల చేసే అవకాశం..
- లేదంటూ 12, 13 తేదీల్లో ఫలితాల వెల్లడి
TS inter results 2026 : ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఫలితాల తేదీ గురించి రోజుకో వార్త వస్తోంది. అంతేకాదు కావాలనే రిజల్ట్స్ విడుదల ఆలస్యం చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చింది.
Also Read : Rythu Bharosa Funds : రైతు భరోసా రెండో విడత నిధులు వచ్చేస్తున్నాయ్..! తేదీ ఫిక్స్.. ఎన్ని ఎకరాల వారికంటే?
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై.. మార్చి 18వ తేదీతో ముగిశాయి. సమాధాన పత్రాల మూల్యాంకనం గత నెలాఖరులోనే పూర్తయింది. అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో ఫెయిలైన విద్యా ర్థుల సమాధానపత్రాలను ఈసారి మళ్లీ మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. విద్యా శాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని ఫలితాలను ఈనెల 11న విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే శనివారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. శనివారం ఫలితాలు వెల్లడి కాకుంటే.. ఆదివారం లేదా సోమవారం ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి రాగానే.. ఫలితాల విడుదలపై మరింత స్పష్టత రానుంది. ఇదిలాఉంటే.. ఈసారి ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,97,075 మంది హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది ప్రథమ సంవత్సరం, 5,07,949 ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఇలా తెలుసుకోండి..?
♦ TSBIE అధికారిక వెబ్సైట్ క్లిక్ చేయండి.https://tgbie.cgg.gov.in/
♦ Inter Results 2026 లింక్‌పై క్లిక్ చేయండి
♦ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి
♦ Submit బటన్‌ను క్లిక్ చేయండి
♦ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
♦ ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
సంవత్సరం, తేదీల వారీగా ఇంటర్ ఫలితాలు వెల్లడైన వివరాలు..
♦ 2014- మే 3న ఫలితాలు విడుదల
♦ 2015- ఏప్రిల్ 22
♦ 2016- ఏప్రిల్ 22
♦ 2017- ఏప్రిల్ 16
♦ 2018- ఏప్రిల్ 13
♦ 2019- ఏప్రిల్ 18
♦ 2020- జూన్ 18 (కొవిడ్ కారణంగా అందరూ పాస్)
♦ 2021- జూన్ 28 (కొవిడ్ కారణంగా అందరూ పాస్)
♦ 2022- జూన్ 28
♦ 2023- మే 9
♦ 2024- ఏప్రిల్ 24
♦ 2025- ఏప్రిల్ 22న ఫలితాలు విడుదల
