TS Inter Results 2026 : నేడే ఇంటర్ ఫలితాలు.. వాట్సాప్‌లో ఇలా చెక్ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్ ఫుల్ డీటెయిల్స్..

TS Inter Results 2026 : ఉదయం 11గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ (జనరల్ అండ్ వొకేషనల్) ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసారి ఫలితాలను వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోవచ్చు..

TS inter results 2026

  • ఇవాళ ఇంటర్ ఫలితాలు వెల్లడి
  • ఉదయం 11గంటలకు విడుదల
  • వాట్సాప్‌లోనూ మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

TS Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. ఉదయం 11గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ (జనరల్ అండ్ వొకేషనల్) ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, సెక్రటరీ యోగితా రాణా చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుంది. హైదరాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.

Also Read : ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఫలితాల వెల్లడి ఆరోజే.. క్లారిటీ వచ్చేసింది.

ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్‌సైట్లు tgbie.cgg.gov.in, results.cgg.gov.in లలో విద్యార్థులు తమ రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది స్టూడెంట్స్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది విద్యార్థులు.. రెండో సంవత్సరంలో 5,07,949 విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలాఉంటే.. ఈసారి ఇంటర్ ఫలితాలను వాట్సాప్ లోనూ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన సేవలను సచివాలయంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ఆవిష్కరించారు.

వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే విధానం..
♦ ముందుగా మీ మొబైల్‌లో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
♦ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి.
♦ వచ్చే రిప్లైలో ‘మెనూ’ (Menu) పై క్లిక్ చేసి ‘BIE Exam Result’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
♦ అనంతరం ‘Open Service’ బటన్ నొక్కండి.
♦ అక్కడ మీ హాల్ టికెట్ నంబర్, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) వివరాలను ఎంటర్ చేయండి.
♦ ఆ తరువాత మీ ఫలితం, మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.