TG SI Recruitment: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. 275 ఎస్సై, జైలర్ పోస్టులకు ఆఖరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి!
తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TG SI Recruitment) కీలక అప్డేట్ ఇచ్చింది.
Tslprb telangana police si recruitment 2026 application last date apply online
- పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు ముగింపు
- సెప్టెంబర్ 16తో ఆఖరి తేదీ
- డిగ్రీ అర్హతతో భారీ జీతం
TG SI Recruitment: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్(TG SI Recruitment) బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల విడుదల చేసిన పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో మూడు రోజుల్లో, అంటే సెప్టెంబర్ 16తో ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని బోర్డు సూచించింది.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 275 ఎస్సై, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 21 నుండి 25 సంవత్సరాల వయోపరిమితి ఉన్నవారు అర్హులు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం, వేతనాలు:
అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు (PMT/PET), తుది రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రుసుముగా సాధారణ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ, ఎస్టీలు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 42,300 నుండి రూ. 1,15,270 వరకు వేతనం అందుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో త్వరపడి అప్లై చేసుకోవచ్చు.
