VC Sajjanar : ఆర్టీసీ బస్సులో కుటుంబంతో కలిసి ప్రయాణించిన సజ్జనార్‌

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సంస్థ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితమని తెలిపేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలిచారు.

  • Published On : November 30, 2021 / 08:46 AM IST

Rtc Sajjanar

VC Sajjanar traveling in RTC bus : టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సంస్థ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అని తెలిపేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జనార్‌ తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఎక్కడికో వెళ్తున్నారు.

ఈ పర్యటన కోసం ఆయన ఆర్టీసీ బస్సును ఎంచుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఇక బస్సులో మ్యూజిక్‌ ప్లే అవుతుండగా అందరూ చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు సజ్జనార్‌ కూడా డ్యాన్స్‌ చేశారు. సరదాగా రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

TSRTC : శబరిమల యాత్రకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఆ ఐదుగురికి ఉచిత ప్రయాణం
‘‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయంగా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మీరు గ్రేట్‌ సార్‌’’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.