TSRTC : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాయితీ

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

TSRTC Special Discount : టీఎస్ఆర్టీసీ దసరా ఆఫర్ ప్రకటించింది. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఆర్టీసీ స్పెషల్ డిస్కౌంట్ ప్రకటించింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 15 నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి గానూ రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని తెలిపింది.

సెప్టెంబర్ 30వ తేదీ లోపు టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. బతుకమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది సొంతూళ్లకు వెళ్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది.

TSRTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. నెలరోజుల తరువాత బిల్లుకు ఆమోదం

దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ల కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్http://www.tsrtconline.in/లో సంప్రదించాలని కోరారు.

 

ట్రెండింగ్ వార్తలు