Bhadradri Kothagudem district: ఇన్సురెన్స్ డబ్బుల కోసం స్నేహితుడిని చంపేందుకు ప్రయత్నించారు ఇద్దరు యువకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు నిందితులు. పథకం ప్రకారం స్నేహితుడి పేరిట కోటి రూపాయలకు ఇన్సురెన్స్ తీసుకున్నారు. అతడిని చంపేసి ఆ డబ్బంతా తీసుకోవాలని కుట్రపన్నారు. ఇనుప రాడ్‌తో తన స్నేహితుడి తలపై కొట్టారు. అతడు చనిపోయాడని భావించి, రోడ్డు ప్రమాదం జరిగినట్టు కథ అల్లారు.
Also Read: Video: వారెవ్వా.. ప్రపంచంలోని కోట్లాది జంటలకు దక్కని విషెస్.. ఈ జంటకు దక్కింది..
ఆ తర్వాత బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి పేరును కట్ట యశ్వంత్‌గా గుర్తించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
యశ్వంత్ స్నేహితులు కట్ట సాయి దీపక్, కొండా భాను ప్రకాశ్‌ను నిందితులుగా పోలీసులు గుర్తించారు. బూర్గంపాడు పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు. కట్ట యశ్వంత్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరం గ్రామమని చెప్పారు.